మే 31న GRTA ఆధ్వర్యంలో ‘సరదా సాయంకాలం’.. సాంస్కృతిక ప్రదర్శనలకు ఆహ్వానం!
GRTA: గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ (GRTA) ఆధ్వర్యంలో “సరదా సాయంకాలం” పేరుతో భారీ సాంస్కృతిక వేడుకను నిర్వహించనున్నారు. 2026, మే 31వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గ్లెన్ అలెన్ లోని ట్విన్ హిక్కరీ రోడ్డులో గల వేదికపై ఈ కార్యక్రమం జరగనుంది.
సాంస్కృతిక ప్రదర్శనలు..
ఈ సంవతంసరంలో అసోసియేషన్ నిర్వహిస్తున్న మొట్టమొదటి భారీ కార్యక్రమం కావడంతో, దీనిని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక తెలుగు వారు తమ ప్రతిభను చాటుకునేలా డాన్స్, మ్యూజిక్ , జానపద కళారూపాలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు.
వివరాలు..
- తేదీ & సమయం: మే 31, 2026 | సాయంత్రం 4:00 నుండి 10:00 వరకు.
- వేదిక: 4801 Twin Hickory Road, Glen Allen, VA 23059.
- రిజిస్ట్రేషన్ గడువు: సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొనదలచిన వారు మే 16వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలి.
కార్యవర్గ సభ్యులు..
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రెసిడెంట్ జయపాల్ కాసర్ల, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సోంపల్లి, జనరల్ సెక్రటరీ వినోద్ రావురు, ట్రెజరర్ నాగేంద్ర నల్లం, కల్చరల్ సెక్రటరీ అనిత బొద్దున, స్పోర్ట్స్ సెక్రటరీ స్నేహిత్ రెడ్డి, సోషల్ అవుట్రీచ్ సెక్రటరీ శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రిచ్మండ్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు కుటుంబాలన్నీ ఈ ‘సరదా సాయంకాలం’లో పాల్గొని విజయవంతం చేయాలని కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. స్టాళ్లు లేదా స్పాన్సర్షిప్ వివరాల కోసం అధ్యక్షుడు జయపాల్ కాసర్లను 603-767-8060 సంప్రదించవచ్చు.






