Nara Lokesh: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన విజయవంతం
ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో పలు ప్రముఖ సంస్థల అధినేతలతో, ఇతరులతో సమావేశమ య్యారు. విశాఖ, అమరావతి కేంద్రంగా ఐటీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సంస్థల అధినేతలను ఆహ్వానించారు.
జడ్‌స్కేలర్, సేల్స్‌ఫోర్స్ సంస్థల ప్రతినిధులతో…
శాన్ ఫ్రాన్సిస్కోలో క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ జడ్‌స్కేలర్ సీఈవో జే చౌదరి, ప్రముఖ క్లౌడ్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో లోకేశ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ‘‘డేటా సిటీ’’గా అభివృద్ధి చెందుతున్న విశాఖకు గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు వస్తున్నాయని, ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కోసం ఆర్ అండ్ డి, డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జడ్స్కేలర్ను కోరారు. అలాగే, విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని సేల్స్‌ఫోర్స్‌ను ఆహ్వానించారు.
కంప్యూటింగ్ సీటీవో, కాన్వా ప్రతినిధులతో భేటీ
రాజధాని అమరావతిలో రాబోతున్న ‘‘క్వాంటమ్ వ్యాలీ’’లో పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని రిగెట్టి కంప్యూటింగ్ సీటీవో డేవిడ్ రివాస్‌ను లోకేశ్ కోరారు. అమరావతిలో ఎంటర్టైన్మెంట్ సిటీలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ‘‘క్రియేటర్ ల్యాండ్’’ ప్రాజెక్టులో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని డిజైన్ ప్లాట్‌ఫామ్ సంస్థ కాన్వా ప్రతినిధులను కోరారు. కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ (సీసీఎస్ఓ) రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మాట్ లతో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమయ్యే ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏపీలోని పారిశ్రామిక జోన్లో ఏర్పాటు చేయాలని ఓమియం సంస్థ సీఎస్‌టీవో చొక్కలింగం కరుప్పయ్యకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీలో సౌర/పవన సామర్థ్యంతో నడిచే పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను సహ-అభివృద్ధి చేయడంతోపాటు సరఫరా పరిశ్రమలు, రవాణా, అమ్మోనియా ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఓపెన్ ఎఐ ప్రతినిధులతో…
ఏపీలో ఏఐ యూనివర్శిటీ ఏర్పాటుకు కలిసి పనిచేద్దామని ప్రఖ్యాత ఓపెన్ ఏఐ సంస్థను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఆమెరికా పర్యటనలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఒక ఏఐ ఆధారిత సభ్యుడు.. అనే లక్ష్యాన్ని సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం మాతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. డేటా సెంటర్ హబ్‌గా మారుతున్న ఏపీని ఓపెన్ ఏఐ డేటా సెంటర్ కార్యకలాపాలకు ఎంపిక చేసుకోవాలని కూడా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస్ నారాయణన్ మాట్లాడుతూ ఎంటర్ ప్రైజ్ ఏఐ ఇంటిగ్రేషన్ కోసం ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ 180కి పైగా దేశాల్లో వినియోగదారులు, సంస్థలకు సేవలు అందిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చర్చిస్తామన్నారు.
ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌తో…
ఆమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ శాన్ఫ్రాన్సిస్కోలో ఏఎండీ ంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగం) వంశీ బొప్పనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ%ౌ% విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారవుతోందన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ పాలసీని ప్రకటించారు. ఏపీలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో (శ్రీసిటీ, కొప్పర్తి,) ఏఎండీ ఉత్పత్తుల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, సప్లయ్ చెయిన్‌లో భాగస్వామ్యం వహించాలని కోరారు.
శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో..
ఆంధ్రప్రదేశ్‌లో అమెరికా సంస్థల పెట్టుబడులకు సహకరించాలని శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ శాన్ఫ్రాన్సిస్కోలో సీజీఐ శ్రీకర్రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. .దేశంలోనే తొలిసారిగా ఎంవోయూల అమరావతిలో అతి త్వరలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖపట్నం డేటా హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా శ్రీకర్‌రెడ్డిని మంత్రి లోకేష్ కోరారు.
సెలెస్టా కంపెనీతో…
ఆంధ్రప్రదేశ్‌లో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా విసి మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ శాన్ఫ్రాన్సిస్కోలో అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందన్నారు.
ఆటో డెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్‌తో భేటీ
ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్వేర్, 3డీ డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో పేరెన్నికగన్న ఆటో డెస్క్ సంస్థ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్, సీనియర్ డైరెక్టర్ అల్లిసన్ రోస్తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగంగా అమరావతిలో డిజైన్, ఇన్నోవేషన్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. వినతిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో
దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రపథాన నిలుపుతామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏఐ యుగంలో న్కెపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఏపీలో అనుభవం, దార్శనికత కలిగిన సమర్థ నాయకత్వం ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇతర రాష్ట్రాలు ఇవ్వలేని వేగాన్ని నిరంతరంగా మేం అందిస్తాం. ఒక్కసారి మాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్. ప్రతి ఎంవోయూను ట్రాక్ చేస్తాం. నిశితంగా పర్యవేక్షిస్తాం. ఒక నిర్థిష్టస్థాయికంటే ఎక్కువ పెట్టుబడి ఉంటే ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫాలో అప్ చేస్తాం. దాదాపు 30 వాట్సాప్ గ్రూప్‌ల్లో నేను ఉన్నాను’’ అని మంత్రి లోకేష్ వివరించారు.’’ అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
సమావేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏఐ డేటా, ఇన్నోవేషన్ హెడ్ ఆండ్రీ డూయెట్, ఫ్యూజన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పార్టనర్ డేవిడ్ గెర్స్టర్, బెంజిమిన్ లార్సన్ (ఇనీషియేటివ్ లీడ్, ఏఐ సిస్టమ్స్ అండ్ సేఫ్టీ, సెంటర్ ఫర్ ఏఐ ఎక్స్ లెన్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం), పీటర్ లీరో-మునోజ్ (ఎస్ వీపీ ఫర్ టెక్ ఇన్నోవేషన్ అండ్ పాలసీ, బే ఏరియా కౌన్సిల్), లూకే కోవాల్స్కీ (ఎస్ వీపీ కార్పోరేట్ ఆర్కిటెక్చర్, ఒరాకిల్), మాక్స్ లోబో (సీఈవో, ఆస్క్ మీడియా), విశాల్ మిశ్రా (జనరల్ పార్టనర్, క్లియన్ స్టోన్ వెంచర్స్), సీన్ రాండాల్ఫ్ (సీనియర్ డైరెక్టర్, బే ఏరియా కౌన్సిల్ ఎకనమిక్ ఇన్ స్టిట్యూట్), వివేక్ వాద్వా (సీఈవో, వియోనిక్స్ బయోసైన్సెస్), సోంగీ యూన్ (మేనేజింగ్ పార్ట్నర్, ప్రిన్సిపల్ వెంచర్ పార్టనర్స్) తదితరులు పాల్గొన్నారు.
ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో భేటీ
ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ శాంటాక్లారాలోని కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్‌ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి. ఇంటెల్ స్థాపనతో యాన్సిలరీ సప్లయర్స్, కాంపోనెంట్ తయారీ సంస్థలు రాష్ట్రంలో ఆకర్షితమవుతాయి’’ అని ప్రతిపాదించారు.
‘ఎన్ విడియా’ రాజ్ మిర్ పూరితో భేటీ
గేమింగ్, చిప్ డిజైనింగ్, జీపీయు మ్యానుఫ్యాక్చరింగ్‌లో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ (ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్) రాజ్ మిర్ పూరితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ శాంటాక్లారాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల బలోపేతానికి సహకారం అందించాలని కోరారు.
గూగుల్ సీఈవోతో భేటీ
గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం, అమలుకాలంపై చర్చించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ భారత్‌లో క్లౌడ్ రీజియన్ల విస్తరణతోపాటు ‘‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్’’ ద్వారా స్టార్టప్‌లకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ డేటా సెంటర్ అమెరికా వెలుపల అతిపెద్ద ఎఫ్‌డీఐగా పేర్కొన్నారు. సమావేశంలో బికాష్ కోలే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థామస్ కురియన్ సిఈఓ గూగుల్ క్లౌడ్ పాల్గొన్నారు.
సీఈవో శంతను నారాయణన్‌తో…
అడోబ్ సీఈవో శంతను నారాయణన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో అడోబ్ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) లేదా డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అడోబ్ సీఈవో శంతను నారాయణన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగంతో భేటీ
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ‘‘అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ ఆర్ అండ్ డి/ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి. విశాఖపట్నంలో ఒక జీసీసీ (జీసీసీ) ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండని కోరారు.






