శ్రీశైలం మల్లన్నకు అమెరికా భక్తుడు … భూరి విరాళం
శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఓ భక్తుడు భూరి విరాళం సమర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్‌దత్ బంగారు, వెండి సామగ్రా, ఆభరణాలను ఆలయానికి అందజేశారు. 28.3 గ్రాములున్న 2 బంగారు బాషికాలు, 5 గ్రాముల బంగారు కంకణం, 1.25 కిలోల వెండి పళ్లెం, 865 గ్రాముల వెండి శక్తి ఆయుధం, 550 గ్రామలు వెండి నాగహారతి, 290 గ్రాముల కుక్కట ధ్వజం, 750 గ్రాముల ఐదు వెండి గిన్నెలు, 920 గ్రాముల గంధాక్షత గిన్నె, 190 గ్రాముల కమండలాన్ని, 300 గ్రాముల పెద్ద కమాండలాన్ని కొత్తపల్లి సునీల్‌దత్ కుటుంబం అందజేసింది. అనంతరం దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేసి సత్కరించారు.







