CJI: అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు. రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్ల వ్యయంతో 33.20 ఎకరాల విస్తీర్ణంలో 36 మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో నివాస గృహాలను నిర్మించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 13 బంగాళాలను నిర్మించేందుకు తగిన స్థలాన్ని కూడా కేటాయించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆవిష్కరించారు. అనంతరం జడ్జిల బంగ్లాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రారంభోత్సవం అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఒక నివాస గృహాన్ని సందర్శించారు.
మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ అథార్టీ నేతృత్వంలో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సు. సదస్సుకు హాజరైన సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు.

















