CII Partnership Summit: మరోసారి విశాఖలో ‘సీఐఐ భాగస్వామ్య సదస్సు’!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం మరో భారీ అంతర్జాతీయ పారిశ్రామిక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ’31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు’ (CII Partnership Summit) జరగనుంది. 2026 నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖ వేదికగా ఈ మెగా సదస్సును నిర్వహించనున్నట్లు సీఐఐ అధికారికంగా ప్రకటించింది.
గత సదస్సు ఘనవిజయం స్ఫూర్తిగా..
గతేడాది (2025 నవంబర్) విశాఖపట్నంలోనే జరిగిన 30వ ఎడిషన్ భాగస్వామ్య సదస్సు అద్భుత విజయం సాధించింది. ఆ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక, విద్య, విధాన రూపకల్పన (Policymaking) రంగాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సదస్సు (CII Partnership Summit) సాధించిన భారీ విజయం, ఇచ్చిన ఉత్సాహంతోనే.. ఈ ఏడాది 31వ ఎడిషన్ను కూడా అదే స్థాయిలో విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సదస్సు ప్రధాన అజెండా..
ప్రతి ఏటాలాగే ఈ సారి కూడా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు, గ్లోబల్ కంపెనీల సీఈఓలు (CEOs), మేధావులు ఒకే (CII Partnership Summit) వేదికపైకి రానున్నారు. ఈ వేదికపౌ నూతన ఆర్థిక ధోరణులు (Emerging economic trends), ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం (Investment flows), దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం తదితర కీలక అంశాలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చలు జరపనున్నారు.
ఈ (CII Partnership Summit) సదస్సులో పాల్గొనడానికి ముందస్తు రిజిస్ట్రేషన్ కచ్చితంగా తప్పనిసరి అని సీఐఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నీరజా భాటియా స్పష్టం చేశారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని, అప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి

















