ఏపీలో సుప్రీంకోర్టు ఆదేశాలకు.. విరుద్ధంగా

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అరెస్టులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‍కు చంద్రబాబు లేఖ రాశారు. అరెస్టులతో ఏపీ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. నోటీసులు ఇవ్వకుండానే గుంటూరు అరండల్‍పేట పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారన్నారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీని ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.