Prakasham: సడెన్ గా స్టేషన్ కు ఎస్పీ, ఉలిక్కిపడ్డ పోలీసులు

ఇటీవల ఏపీ ప్రభుత్వం(Ap government) పెద్ద ఎత్తున ఎస్పీలను, కలెక్టర్ లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ లు, ఎస్పీలో జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా పోలీసు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్, రూరల్ సర్కిల్ ఆఫీస్ తోపాటు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు ఎస్పీ. పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించిన ఆయన.. ఇబ్బందికి పలు సూచనలు చేసారు.
చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లోనే మహిళా సహాయక కేంద్రం, రిసెప్షన్, లాక్ అప్ రూమ్స్ పరిశీలించిన ఆయన, అక్కడ ఉన్న పరిస్థితులపై అసహనం వ్యక్తం చేసారు. స్టేషన్ బయట నిలబడిన ఫిర్యాదుదారులతో స్వయంగా.. మాట్లాడి పోలీసుల పని తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్ కు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే… వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.
పోలీసు స్టేషన్ కు వచ్చే… వారి పట్ల మర్యాదగా వ్యవహరిస్తే.. పోలీసుల పట్ల ప్రజలలో గౌరవం పెరుగుతుందని, పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన వాహనాలను అడిగి తెలుసుకున్నారు. కోర్టు అనుమతితో వాహనాలను డిస్పోసల్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అలాగే పోలీసు స్టేషన్ క్రైమ్ మ్యాప్ లను పరిశీలించారు ఎస్పీ. పోలీసు స్టేషన్ లోని రికార్డ్ లను సైతం పరిశీలించారు. పాత కేసుల పై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రత్యేక టీం లను ఎర్పాటు చేసి కేసులను త్వరితగతిన ఛేధించాలని ఆదేశించారు.
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి నిరంతరం డ్రోన్(Drone) కెమెరాలతో నిఘా పెట్టాలని, అవసరమైతే డ్రోన్ లను కొత్తగా తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, అల్లర్లు చేసిన అలాంటి వారిని ఉపేక్షించవద్దని, లా అండ్ ఆర్డర్ కు విఘాతం కల్గించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసారు. ఈ సందర్భంగా సీసీ కెమరాలను కూడా ఆయన పరిశీలించి సిబ్బందిని సున్నితంగా హెచ్చరించారు ఎంపీ. విధి నిర్వహణ లో అలసత్వం వహిస్తే సహించేదిలేదని స్పష్టం చేసారు.