Asaduddin Owaisi: లోకేష్ నాయకత్వం..? ఎన్టీఆర్ రీ ఎంట్రీ..? ఓవైసీ మాటలతో పెరుగుతున్న ఉత్కంఠ..

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లోనూ ఇప్పుడు చర్చకు దారితీసిన విషయం టీడీపీ (TDP) భవిష్యత్ నాయకత్వం. ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఆయన పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రధానంగా వినిపిస్తోంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), నారా లోకేష్(Nara Lokesh), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)లను ఆయన ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
ఓవైసీ ఇటీవల హైదరాబాద్(Hyderabad)లో జరిగిన ఎంఐఎం సభలో మాట్లాడుతూ, నారా లోకేష్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఆయన మాటల్లో, “చంద్రబాబు గారు చాలాకాలం నుంచి పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి సమయం ముగింపు దశలో ఉంది. ఇకపై యువతకు అవకాశం ఇవ్వాలి. నారా లోకేష్‌కి నాయకత్వాన్ని అప్పగించండి. లేకపోతే ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది” అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ పార్టీలో భవిష్యత్తులో సంభవించే మార్పులపై సందేహాలు మొదలయ్యాయి.
ఇంకా, సభలో ఓవైసీ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో అటు అభిమానుల నుంచి ఇటు రాజకీయ విశ్లేషకుల వరకూ పెద్ద చర్చ మొదలైంది. ఆయన, “ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు కదా? అయినా ప్రజల్లో ఆయనకి క్రేజ్ ఉంది. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినా, లోకేష్‌కి ప్రత్యర్థిగా మారతారా?” అనే ప్రశ్నను సభలో వేసారు. దీనితో ఎన్టీఆర్ రీ ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక ఓవైసీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇది చంద్రబాబు ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పునాది నివ్వాలని చేసిన ప్రకటనకు స్పందనా? లేక గతంలో ఎంఐఎం పార్టీ వైసీపీకి ఇచ్చిన మద్దతుపై వస్తున్న విమర్శలపై సమాధానంగా ఆయన ‘తెదేపా వ్యూహం’ పై తన అభిప్రాయాన్ని వెల్లడించారా? అనే అనుమానాలు రాజుకుంటున్నాయి.
తన ప్రసంగంలో, “యువతకు బాధ్యతలు ఇవ్వాలి. నారా లోకేష్‌కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. ఇలాగే ఇంకొంత కాలం చంద్రబాబు పదవిలో కొనసాగుతూ ఉంటే లోకేష్ భవిష్యత్తు ప్రభావితమవుతుంది” అని ఓవైసీ స్పష్టం చేశారు. అయితే ఆయన మాటల వెనుక అసలైన ఉద్దేశ్యం ఏంటన్నది మాత్రం ఇప్పుడు స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఈ వ్యాఖ్యలతో టీడీపీ నాయకత్వ మార్పుపై కొత్త చర్చ ప్రారంభమైంది. నిజంగా చంద్రబాబు రిటైరయ్యే ఆలోచనలో ఉన్నారా? లోకేష్ పార్టీని పూర్తిగా నడిపించనున్నారా? లేదా ఎన్టీఆర్‌కు కొత్త అవకాశాలు రావచ్చా? అన్నది సమయమే చెప్పాల్సిన విషయం..