Shahbaz Sharif: అమెరికా అధ్యక్షుడిపై పాక్ ప్రధాని షెహబాజ్ ప్రశంసలు

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్(India) పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే 50 సార్లు గొప్పలు చెప్పుకోగా దీనికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) కూడా తోడయ్యారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు వెళ్లిన షెహబాజ్, కాల్పుల విరమణపై ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు ఆయనతో భేటీ తర్వాత, ఐరాస సమావేశంలోనూ వత్తాసూ పలికారు. పాక్(Pakistan)భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేత నాయకత్వ చొరవ ప్రశంసనీయం. ఆయన చర్యతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు నిజాయతీగా కృషి చేస్తున్న ట్రంప్ శాంతికాముకుడు అని షెహబాబజ్ పేర్కొన్నారు.