Telugu Conferences: మాతృభాషలోనే మాధుర్యం : గవర్నర్ అబ్దుల్ నజీర్
ఓ వ్యక్తి తన భావాన్ని మాతృభాషలో వ్యక్తం చేసినట్లు మరే భాషలోనూ చేయలేరు. అలాంటి భాషను జాతీయ సంపదగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir) తెలిపారు. కొన్ని పద్యాలను వల్లేవేస్తూ భాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు (World Telugu Conferences) రెండోరోజైన అదివారం వేడుకగా జరిగాయి. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్స్లర్, కోనసమీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( కిమ్స్) చైర్మన్ కేవీవీ సత్యనారాయణ రాజు (KVV Satyanarayana Raju) (చైతన్య రాజు) అధ్యక్షతన జరుగుతున్న ఈ సభలకు అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మొహియుద్దీన్, జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ చలపతిరావు, జస్టిస్ రామకృష్ణ రెడ్డి, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్, తెలంగాణ హైకోర్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, ఏపీ హైకోర్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధనుంజయ్, ఎంపీ అప్పలనాయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీ ప్రసన్నశ్రీ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి

















