అమెరికా కలవరం…
అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదనీ, తీవ్ర సంక్షోభంలోకి జారుతుందన్న అంచనాలు శుక్రవారం దలాల్ స్ట్రీట్‌ను తీవ్ర ఆందోళనకు గరి చేశాయి. మరోవైపు ఫ్రాంక్లిన్ టెంప్లేషన్ మ్యూచువల్ ఫండ్ తన ఆరు పథకాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం మదుపర్లను కలవరానికి గురి చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలోనే శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 536 పాయింట్ల లేదా 1.7 శాతం పతనమై 31,327.22 కు దిగజారింది. ఎస్ఎస్ఈ నిఫ్టీ 159.5 పాయింట్ల కోల్పోయి 9,154.40 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఒక్క ఫార్మా సూచీ 1.38 శాతం పెరగ్గా.. మిగితా రంగాలన్నీ నష్టపోయాయి. రియాల్టీ 4.18 శాతం, బ్యాకింగ్ 3.36 శాతం, లోహ 2.92 శాతం చొప్పున కోల్పోయాయి. సెన్సెక్స్ 30లో 8 సూచీలు మాత్రమే లాభపడగా 22 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్ 1.77 శాతం, స్మాల్ క్యాప్ 1.4 శాతం చొప్పున విలువ తగ్గాయి.






