US: సుంకాల చెల్లింపులు ఎలా..? ఎన్నేళ్లు పట్టొచ్చు..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సుంకాల రూపంలో ప్రపంచదేశాల నుంచి $133 బిలియన్లు వసూలు చేశారు.ఇప్పుడవి చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ టారిఫ్ లు.. చట్టవిరుద్దమైనవిగా తేలాయి.మరి సుంకాలను తిరిగి వాపసు చేయడానికి ఏది మార్గం. దీనికి ఎన్నేళ్ల సమయం పడుతుంది.. ఇప్పుడు దీనిపై అమెరికాలోని న్యాయనిపుణుల్లో సైతం పలుసందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా వాపసు ప్రక్రియకు సంవత్సరాలు పట్టవచ్చని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా అంగీకరించారు. “రాబోయే రెండు సంవత్సరాలు దీనిపై వ్యాజ్యం వేయాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను” అని శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన విలేకరులతో అన్నారు.”మేము రాబోయే ఐదు సంవత్సరాలు కోర్టులో ఉంటాము” అని ఆయన అన్నారు.
ఇల్లినాయిస్ గవర్నర్, డెమొక్రాట్ అయిన జెబి ప్రిట్జ్కర్… తన రాష్ట్రంలోని కుటుంబాలకు దాదాపు $9 బిలియన్ల సుంకాల వాపసు డిమాండ్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్‌కు బిల్లు పంపారు. “మీ సుంకాల పన్నులు రైతులను ఇబ్బందులపాలు చేశాయి.మా మిత్రులకు ఆగ్రహం తెప్పించాయి. నిత్యవసర ధరలకు రెక్కలు కల్పించాయి., పరిహారం రాకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించారు.
ప్రతి ఇల్లినాయిస్ కుటుంబానికి సుమారు $1,700 చెల్లించాలని డిమాండ్ చేశారు.
ట్రంప్ టారిఫ్ రీఫండ్స్‌పై సందేహాలు
సుప్రీంకోర్టు తర్వాత కంపెనీలు.. తాము చెల్లించిన అధిక సుంకాలను తిరిగిచెల్లించాలని డిమాండ్ చేసే అవకాశముంది. అయితే టారిఫ్ ల భారం తమపై మోపిన కంపెనీల నుంచి.. ఆమేరకు లబ్ధి ప్రజలకు అందనుందా అన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు నిపుణులు.
కంపెనీలు తాము చెల్లించిన డబ్బులను తిరిగి పొందే అవకాశం అధికంగా ఉంది. కానీ సాదారణ అమెరికన్.. ఆమేరకు ప్రత్యక్ష పరిహారం పొందేఅవకాశం ఉందా అని సాక్షాత్తూ ట్రెజరీ కార్యదర్శి బెసెంట్ సందేహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.
ఇవి కూడా చదవండి
ట్రంప్ యొక్క IEEPA సుంకాలను తిరిగి చెల్లించడానికి ఏజెన్సీ …ప్రస్తుత వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నించవచ్చని లా సంస్థ డోర్సే అండ్ విట్నీ భాగస్వామి అయిన ట్రేడ్ న్యాయవాది డేవ్ టౌన్సెండ్ తెలిపారు.
గతంలో, వాణిజ్య కేసులలో కంపెనీలకు తమ డబ్బును తిరిగి ఇవ్వడానికి కోర్టులు ఏర్పాట్లు చేసిన ఒక ఉదాహరణ ఉంది. 1990లలో, ఎగుమతులపై హార్బర్ నిర్వహణ రుసుమును రాజ్యాంగ విరుద్ధమని కోర్టులు కొట్టివేసి, ఎగుమతిదారులు వాపసు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాయి. అయితే ఇలా ఒక్కసారిగా వేలాది మంది నుంచి ఇలాంటి కేసులను.. అమెరికా కోర్టులు, కస్టమ్స్ ఎదుర్కోలేదన్నారు.
ప్రభుత్వం రీఫండ్ల కోసం ఉన్న భారీ డిమాండ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చెప్పడం కష్టమన్నారు యూఎస్ మాజీ వాణిజ్య అధికారి ఒకరు. దిగుమతిదారులు తమ రీఫండ్లను క్లెయిమ్ చేసుకోగల ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి

















