Trump Peace Board: గాజా పునరావాసం ఖర్చు రూ.700 కోట్లు…?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇటీవలే ప్రకటించిన శాంతి మండలిని యాక్టివ్ చేశారు. ఈ పీస్ బోర్డు నుంచి గాజా పునరావాస ప్యాకేజికి 700 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించారు ట్రంప్. ఈ భారీ సాయాన్ని చేసేందుకు ‘శాంతి మండలి’లోని తొమ్మిది సభ్య దేశాలు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కజకస్థాన్, ఉజ్బెకిస్థాన్, యూఏఈ, మొరాకో, బహ్రైన్, ఖతార్, సౌదీ అరేబియా, అజర్బైజాన్, కువైట్‌లు ఈ ప్రతినబూనాయని వెల్లడించారు. బలగాలను ఇచ్చేందుకు ఐదు దేశాలు అంగీకరించాయని, ముందుగా రఫాలో మోహరిస్తామని చెప్పారు.
పీస్ బోర్డు నుంచి ఖర్చు చేేసే ప్రతీ డాలర్.. గాజాలో స్థిరత్వానికి పెట్టుబడి అవుతుందని, సరికొత్త..సామరస్య ప్రాంతానికి ఆశాకిరణం అవుతుందన్నారు ట్రంప్. గాజా పునర్నిర్మాణానికి 7,000 కోట్ల డాలర్లు అవసరమవుతుందని ఇదివరకే అంచనా వేశారు. శాంతి మండలికి అమెరికా వెయ్యి కోట్ల డాలర్లు ఇస్తుందని ట్రంప్ ప్రకటించినా అది దేనికోసమనేది స్పష్టంచేయలేదు.
ఐక్యరాజ్యసమితి బలపడి, సక్రమంగా పనిచేసేటట్లు శాంతిమండలి చూస్తుందని ప్రారంభోపన్యాసంలో ట్రంప్ తెలిపారు. ఇది ఐక్యరాజ్యసమతితో కలిసి పనిచేస్తుందన్నారు. రెండోసారి అధ్యక్షుడినయ్యాక తొలి ఏడాదిలోనే భారత్-పాక్ సహా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించినా వాటిలో ఒక్కదానిపైనా ఐక్యరాజ్యసమితితో మాట్లాడలేదని చెప్పారు ట్రంప్. పాక్‌కు గొప్ప ఫీల్డ్‌మార్షల్ ఉన్నారని కితాబిచ్చారు. తాను లేనప్పుడూ కూడా ఐక్యరాజ్యసమితి బలంగా ఉండి పనిచేసేందుకు శాంతి మండలి దోహదం చేస్తుందన్నారు.

















