ట్రంప్ లో దేశాధినేతకు ఉండాల్సిన పరిణతి లేదా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఆ దేశ రక్షణ అధికారులకు నమ్మకం లేదా..? యూఎస్ ఫైటర్ జెట్ .. ఇరాన్ భూభాగంలో పడిపోయినప్పుడు రెండో పైలట్ అక్కడే చిక్కుకున్న సమయంలో.. రెస్క్యూఆపరేషన్ నిర్వహించిన అమెరికా అధికారులు.. వార్ రూమ్ కు ట్రంప్ ను దూరం ఉంచినట్లు తెలుస్తోంది. ట్రంప్ గతంలో వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకొని వారు ఆయనకు పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంచారట.
ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ ఇరాన్ భూభాగంపై కూలడంతో అమెరికాకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఒక పైలట్‌ను వెంటనే కాపాడినా.. అదే విమానంలో మరో పైలట్ (వెపన్ ఆఫీసర్) జాడ మాత్రం తెలియలేదు. ఇక ఆ సైనికుడిని కాపాడేందుకు అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మిలిటరీ, నేషనల్ సెక్యూరిటీ అధికారులు 24 గంటలపాటు ఈ ఆపరేషన్‌ను నేరుగా పర్యవేక్షించింది అమెరికా. దాని వివరాలు ఆయనకు ఇచ్చినప్పటికీ.. అసలు అది ఎలా సాగుతోందనే దానిపై ప్రతి విషయాన్ని ఆయనకు క్షుణ్ణంగా తెలియజేయలేదు.. ఆ వివరాల ఆధారంగా ట్రంప్ ఏవైనా మాటలు మాట్లాడితే, ఆపరేషన్‌కే ఎసరు తేవచ్చనే ఆందోళనతోనే ఆయనకు పరిమిత సమాచారమే ఇచ్చారట.
ఇవి కూడా చదవండి
US-IRAN WAR:
ఆపరేషన్‌ను పర్యవేక్షించేవారు రెస్క్యూ బృందాలతో మాట్లాడాలి.. ఇరాన్ (Iran) బలగాల కదలికలను గమనించాలి. పరిస్థితులు చేయిదాటితే ఎలా ఎదుర్కోవాలో అంచనా వేయాలి. మామూలుగా ఈ ప్రక్రియ అంతా జరిగే సిట్యుయేషన్ రూమ్‌లో అధ్యక్షుడి పర్యవేక్షణ ఉంటుంది. అయితే ఇరాన్లో విమానం కూలడంతో ఆయన సహాయకులపై గట్టిగా కేకలు వేశారట. ఆ ఘటనపై ఆయన తీవ్ర ఆందోళన చెందారని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఇరాన్ భూభాగంలోకి వెళ్లి, ఆ సైనికుడిని తీసుకురావడం ఎంత క్లిష్టమైందో తెలిసినప్పటికీ.. వెంటనే అతడిని తీసుకురావాలని ఒత్తిడి తీసుకువచ్చారట. ఇది తన రాజకీయ జీవితంలో అతిపెద్ద విపత్తుగా మిగిలిపోతుందేమోనన్న భయం ట్రంప్‌లో కనిపించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన అసహనం ఆపరేషన్ ప్లానింగ్‌నే దెబ్బతీయొచ్చని అధికారులు భావించారట.
దాంతో ఆపరేషన్ నిర్వహించే రూమ్‌కు ఆయన్ను కొన్ని గంటల పాటు దూరంగా ఉంచారట. ఫోన్లోనే ఆయనకు వివరాలు చెప్పారట. అయితే దానిని పర్యవేక్షించిన వారిలో ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, పెంటగాన్, నిఘా సంస్థల అధికారులు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టాఫ్ ఉన్నారు. ఇక ఆ రెండో సైనికుడిని కూడా కాపాడినట్లు సమాచారం ఇవ్వగానే ట్రంప్ దూకుడుగా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
ఇవి కూడా చదవండి






