ASBL NSL Infratech

తానా మహాసభలు... మహిళా కార్యక్రమాలు

తానా మహాసభలు... మహిళా కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో  జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు. ఈ మహాసభల్లో మహిళలకు ఉపయోగపడేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఉమెన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జూలై 8న ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌` మెడికల్‌ (నారీశక్తి) పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పలురంగాలకు చెందిన మహిళా ప్రముఖులు పాల్గొని మాట్లాడనున్నారు. శిరీష బండ్ల (స్పేస్‌), సత్యవాణి (భారతీయం), నందమూరి వసుంధర, సింగర్‌ చిత్ర, సుమ కనకాల, శ్రీలీల, లయ గొర్తి, సింగర్‌ సునీత పాల్గొనే ఈ కార్యక్రమానికి టీవీ 5 మూర్తి యాంకర్‌గా వ్యవహరించనున్నారు. 

జూలై 9న జరిగే కార్యక్రమంలో శైలజ అడ్లూరు, చంద్రబోస్‌, సత్యవాణి(భారతీయం), జనేతా రెడ్డి (అటార్నీ), కౌసల్య (సింగర్‌), బాలాజీ ప్రకాశరావు (సోషల్‌ ఎంట్రప్రెన్యూరర్‌, మహిళల శ్రేయస్సు కోరే వ్యక్తి) పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి టీవీ 9 రజనీకాంత్‌ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

 

Tags :