ASBL NSL Infratech

ఘాటితో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వ‌నున్న స్వీటీ

ఘాటితో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వ‌నున్న స్వీటీ

సౌత్ ఆడియ‌న్స్‌కు అనుష్క శెట్టి టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అనుష్క కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కే ప‌నికొస్తుంద‌నుకున్న వారికి అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి సినిమాల‌తో త‌నేంటో ప్రూవ్ చేసుకుని స‌త్తా చాటింది. స‌రైన క‌థ ప‌డితే అనుష్క వండ‌ర్స్ క్రియేట్ చేయ‌గ‌ల‌ద‌ని అంద‌రూ న‌మ్మారు. అయితే గ‌త కొన్నేళ్లుగా అనుష్క సినిమాల విష‌యంలో కాస్త వెనుక‌డుగేస్తుంది. చాలా గ్యాప్ త‌ర్వాత అనుష్క చేసిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్ని అందుకుంది. అనుష్కను చూసి ఆమె ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు. ఇదిలా ఉంటే అనుష్క ప్ర‌స్తుతం క్రిష్ డైరెక్ష‌న్ లో ఘాటి అనే ఎక్స్‌పెరిమెంట‌ల్ సినిమా చేస్తుంది. ఈ సినిమాతో అనుష్క మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో చూపిస్తుందంటున్నారు.

అనుష్క కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంద‌రినీ ఘాటి శాటిస్‌ఫై చేస్తుందంటున్నారు. ఈ సినిమాతో అనుష్క డ‌బుల్ ఫోర్స్ తో కంబ్యాక్ ఇస్తుందని, క్రిష్ కూడా ఈ సినిమాను ఎంతో ప్రేమించి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో అనుష్క స‌త్తా ఏంటో బాగా తెలుసు కాబ‌ట్టి క్రిష్ ఆమె ఫ్యాన్స్ ను స‌ర్‌ప్రైజ్ చేసేలా ఘాటిని తెర‌కెక్కిస్తున్నాడ‌ని, ఈ సినిమా కోసం అనుష్క కూడా ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తుంద‌ని, ఘాటి సినిమాతో మ‌రోసారి వింటేజ్ అనుష్కను చూడొచ్చ‌ని అంటున్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :