ASBL NSL Infratech

భారీగా పల్నాడులో నమోదైన కేసులు.. అరెస్టుల పర్వం షురూ ..

భారీగా పల్నాడులో నమోదైన కేసులు.. అరెస్టుల పర్వం షురూ ..

మే 13న ఆంధ్రాలో పోలింగ్ నేపథ్యంలో ప్రముఖంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసు శాఖ భారీ సంఖ్యలో కేసులను నమోదు చేస్తోంది. పోలింగ్ రోజు.. ఆ తరువాత రోజు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో అల్లర్లు చెలరేగాయి. కొన్ని ప్రాంతాలలో ఈ అల్లర్లు హింసాత్మక ఘటనలుగా మారడంతో ఎందరో గాయాలు పాలయ్యారు. ఇక ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్న సిట్ తన దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీతో పని లేకుండా వైసీపీ, టీడీపీ ఇరుపక్షాల వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు.

గురజాల నియోజకవర్గంలో 100 కేసులు నమోదు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కేసులో నమోదు చేసిన పోలీసు శాఖ ఎఫ్ఐఆర్ లో 192 మంది పేర్లు చేర్చారు. ఇక దాచేపల్లి మండలంలో ఒక 70 మంది.. పిడుగురాళ్లలో 64 మందిపై ఐపీసీ 307, 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇటు సత్తనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు ఈ సంఘటనల విషయంలో 70 మందిని నిందితులుగా గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో నమోదైన ఐదు కేసులకు గాను 99 మంది నిందితులు పోలీసు లిస్టులో చేరారు. నరసరావుపేటలో 20 కేసులు నమోదు కాగా.. జరిగిన దాడులలో 60 మంది నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చి అందులో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు నుంచి సమస్యాత్మకంగా మారిన మాచర్ల నియోజకవర్గం కారంపూడి ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో వైసీపీకి చెందిన వ్యక్తులు 11 మంది ఉండగా.. టీడీపీ చెందిన వాళ్లు 8 మంది ఉన్నారు. పల్నాడు ఎన్నికల హింసపై దర్యాప్తు ప్రారంభించిన షిఫ్ట్ బృందం నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి తన విచారణ షురూ చేస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :