ASBL NSL Infratech

ఆర్ఎస్ఎస్ నీడను దాటి బీజేపీ ఎదిగిందా...?

ఆర్ఎస్ఎస్ నీడను దాటి బీజేపీ ఎదిగిందా...?

ఆర్ఎస్ఎస్ సైద్దాంతిక భావజాలం, క్రమశిక్షణ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల సాయంతో బీజేపీ విత్తనం స్థాయి నుంచి మహావృక్షంలా మారింది. అయితే..బీజేపీ ఇప్పటికీ RSS నీడలోనే ఉందని, ఆ సంస్థ ముందుండి బీజేపీని నడిపిస్తోందని చాలా మంది వాదిస్తుంటారు. పార్టీ సిద్ధాంతం అంతా RSS నుంచి పుట్టిందే అని చెబుతుంటారు. ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన రాగా ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న బీజేపీకి, అప్పటి పార్టీకి చాలా తేడా ఉందని స్పష్టం చేశారు.

అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ చాలా బలపడిందని, సొంతగా నడిపే సామర్థ్యాన్ని సంపాదించుకుందని వెల్లడించారు నడ్డా. వాజ్‌పేయీ హయాంలో పార్టీ RSSపై ఆధారపడాల్సి వచ్చిందని ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని స్పష్టం చేశారు. "మొదట్లో బీజేపీకి పెద్దగా బలం ఉండేది కాదు. అందుకే RSS సాయం తీసుకుంది. ఆ సంస్థే పార్టీని కొంత వరకూ ముందుకు నడిపించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పార్టీ రూపు రేఖలు మారిపోయాయి. ఎవరూ ఊహించనంతగా ఎదిగింది. ఇప్పుడు మాకు మేముగా పార్టీని నడుపుకునే సామర్థ్యం వచ్చింది".

RSS అనేది ఓ సంస్కృతి ఆధారంగా ఏర్పాటైన సంస్థ అని, బీజేపీ అనేది రాజకీయ పార్టీ అని వివరించారు. ఈ రెండింటికీ తేడాని గమనించాలని తెలిపారు. సొంతగా పనులు చేసుకోలేకపోతే పార్టీ మనుగడ సాధించలేదని అభిప్రాయపడ్డారు నడ్డా. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా చెప్పింది కొంతవరకూ నిజమే.. ఎందుకంటే , ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో బీజేపీ , బీజేపీ కూటములు అధికారంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావం చాలా వరకూ తగ్గిపోయింది. ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు, బీజేపీతో తలపడుతున్నాయి.

అయితే.. ఇప్పటికీ బీజేపీకి ఆర్ఎస్ఎస్ అండగా ఉందన్న వాదనలోనూ బలం కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ బలహీనంగా ఉన్నచోట్ల ఆపార్టీ తరపున క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేవి ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, అనుబంధ సంఘాలు. ఇది అందరికీ తెలిసిందే.. ఆతర్వాతే పార్టీ బలపడడం, దానికి లీడర్లు తయారవడం జరుగుతూ వస్తోంది. నిజంగా ఆర్ఎస్ఎస్ అండ లేకుండా బీజేపీ ఉండగలదా అంటే.. అది అనుమానమే అని చెప్పొచ్చు. ఎందుకంటే..నాయకులు.. పార్టీ బలహీనపడితే వెళ్లిపోతారు. తమ దారి తాము చూసుకుంటారు. కానీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలోని కార్యకర్తలు అలా కాదు.. సంస్థకు అంకితమై పనిచేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న మోడీ కూడా... ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయి ప్రచారక్ గా ఉన్న వ్యక్తే కాబట్టి. అంటే ఆర్ఎస్ఎస్ ప్రభావం .. బీజేపీపై ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :