ASBL NSL Infratech

చ‌ర‌ణ్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తాడా?

చ‌ర‌ణ్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తాడా?

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్ పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా వెంట‌నే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌గానే ఫ్యాన్స్ ఎంతో సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ ఇప్పుడు చ‌ర‌ణ్‌ ఎందుకా సినిమా ఒప్పుకున్నాడా అని బాధ ప‌డుతున్నారు. గేమ్ ఛేంజ‌ర్ సినిమాకు చ‌ర‌ణ్ ఇప్ప‌టికే మూడేళ్ల‌కు పైగా టైమ్ కేటాయించాడు. కానీ ఇప్ప‌టికీ సినిమా పూర్తి కాలేదు. ఈ రోజు వ‌ర‌కు ఆ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌ధ్య‌లో అక్టోబ‌ర్ లో రిలీజ్ కానుంద‌ని వార్త‌లొచ్చాయి కానీ ఇండియ‌న్2 రిలీజ్ డేట్ లో స్ప‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కు గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు. గేమ్ ఛేంజ‌ర్ పూర్తి కాలేద‌నే కార‌ణంతోనే స్క్రిప్ట్ రెడీ అయిన‌ప్ప‌టికీ బుచ్చిబాబు సాన చ‌ర‌ణ్ కోసం ఎదురుచూస్తూ ఖాళీగాఉన్నాడు.

ఇదిగో అదిగో అంటున్నారే త‌ప్పించి చ‌ర‌ణ్ ఫ్రీ మాత్రం అవ‌డం లేదు. జూన్ నుంచి ఆర్సీ16 సెట్స్ పైకి వెళ్తుంద‌ని మెగా వ‌ర్గాలంటున్నాయి. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ బుచ్చిబాబుతో సినిమా చేయ‌నున్నాడు. పుష్ప2 రిలీజ్ త‌ర్వాత అంటే సెప్టెంబ‌ర్ నుంచి సుకుమార్, చ‌ర‌ణ్ సినిమాపైనే వ‌ర్క్ చేయ‌నున్నాడు. కాబ‌ట్టి గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ ఇంకా లేట‌యితే సుకుమార్, బుచ్చిబాబు ఒకేసారి చ‌ర‌ణ్ తో సినిమాలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఏదోటి చేసి చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :