ASBL NSL Infratech

స్పిరిట్ లో అర్జున్ రెడ్డి ఉన్నాడా?

స్పిరిట్ లో అర్జున్ రెడ్డి ఉన్నాడా?

వ‌చ్చే నెల‌లో క‌ల్కి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ప్ర‌భాస్, ఆ త‌ర్వాత రాజా సాబ్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఇది కాకుండా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్2, సందీప్ రెడ్డి వంగ‌తో స్పిరిట్ సినిమాల‌కు సైన్ చేశాడు ప్ర‌భాస్. స‌లార్2కు ముందు డేట్స్ ఇద్దామ‌న్నా నీల్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌ని చూస్తున్నాడు.

ఇక ప్ర‌భాస్ తో సందీప్ రెడ్డి వంగ చేయ‌బోయే సినిమా చాలా భారీగా ఉండబోతున్న‌ట్లు తెలుస్తోంది. యానిమ‌ల్ సినిమాతో బాలీవుడ్ లో సంచ‌లనం సృష్టించిన సందీప్ ప్ర‌భాస్ సినిమాతో పాన్ వ‌ర‌ల్డ్ ని టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే స్పిరిట్ విష‌యంలో సందీప్ స్పెష‌ల్ ఫోక‌స్ పెడుతున్నాడ‌ట‌. అంతేకాదు స్పిరిట్ లో ఓ కీల‌క పాత్ర‌ను అర్జున్ రెడ్డితో అంటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయించ‌నున్నాడ‌ట సందీప్.

ఓ స‌ర్‌ప్రైజింగ్ రోల్ కోసం సినిమాకు హైలైట్ అవుతుంద‌ని ఆ పాత్ర‌ను విజ‌య్ తో చేయించాల‌నుకుంటున్నాడ‌ట సందీప్. విజ‌య్ కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన సినిమా అర్జున్ రెడ్డి. ఆ సినిమా డైరెక్ట‌ర్ అడిగితే విజ‌య్ కాద‌న‌డు. పైగా ప్ర‌భాస్ సినిమా. ఈ వార్త నిజ‌మైతే మాత్రం స్పిరిట్ క్రేజ్ అమాంతం పెర‌గ‌డం ఖాయం. ఇదిలా ఉంటే స్పిరిట్ లో ప్ర‌భాస్ ఒక సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్  గా క‌నిపించ‌నున్నాడు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :