ASBL NSL Infratech

మ‌రోసారి సిక్స్ ప్యాక్ లో ఎన్టీఆర్

మ‌రోసారి సిక్స్ ప్యాక్ లో ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఓ వైపు దేవ‌ర సినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేస్తూనే మ‌రోవైపు వార్2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. టాలీవుడ్ ఆడియ‌న్స్ తో పాటూ యావ‌త్ బాలీవుడ్ కూడా ఎన్టీఆర్ హిందీ ఎంట్రీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో హృతిక్ రోష‌న్ తో క‌లిసి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే ముంబైలో రెండు షెడ్యూళ్ల షూటింగ్ ను కూడా ఎన్టీఆర్ ఫినిష్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ భారీ యాక్ష‌న్ డ్రామా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూడ‌బోతున్నామ‌ని బాలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి.

బాలీవ‌డ్ లోనే మోస్ట్ మ‌జిల్ అండ్ ఫిట్ ప‌ర్స‌న్‌గా పేరున్న హృతిక్ తో క‌లిసి న‌టిస్తున్న‌ప్పుడు బేల‌గా ఉంటే ఎలా అని ఎన్టీఆర్ కూడా కాస్త క‌ష్ట‌మైనా సిక్స్ ప్యాక్ ట్రై చేయ‌బోతున్నాడ‌ట. హృతిక్ తో ఉండే ఓ యాక్ష‌న్ సీన్ లో ఎన్టీఆర్ ష‌ర్ట్ విప్పి త‌న సిక్స్ ప్యాక్ ను చూపించ‌బోతున్నాడ‌ని బాలీవుడ్ మీడియా వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వార్2 పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :