త్రివిక్రమ్ కోసం రవికిషోర్ ఎదురుచూపులు
త్రివిక్రమ్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా రిలీజై కూడా 5 నెలలు పూర్తి కావొస్తుంది. కానీ ఇప్పటివరకు తన తర్వాతి సినిమా ఏంటన్నది క్లారిటీ ఇవ్వడం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను అనౌన్స్ చేశారు కానీ అదెప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? సినిమా క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ గురించిన వివరాలేమీ బయటకు చెప్పలేదు. బన్నీతో త్రివిక్రమ్ చేయబోయే సినిమా తన కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో స్క్రిప్ట్ ను ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్. కానీ పుష్ప2 రిలీజైన వెంటనే బన్నీ ఈ సినిమా చేసే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. అట్లీతో బన్నీ సినిమా చేస్తాడంటున్నారు. అప్పటివరకు ఖాళీగా ఉండటం ఎందుకని త్రివిక్రమ్ ఈ లోపు ఓ చిన్న సినిమా తీయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అవకాశాన్ని వాడుకుని హీరో రామ్ తో ఓ సినిమా చేయించాలని నిర్మాత స్రవంతి రవికిషోర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన స్రవంతి రవికిషోర్ మీద త్రివిక్రమ్ కు ఎంతో అభిమానం. ఆ కృతజ్ఞత కూడా ఎప్పుడూ త్రివిక్రమ్ కు ఉంటుంది. అందుకే రామ్ కాంబోలో ఒక సినిమా చేయించాలని చూస్తున్నాడు రవికిషోర్. కానీ ఆ కాంబో ఇప్పటికీ సాధ్యపడలేదు. త్రివిక్రమ్ సానుకూలంగా స్పందిస్తే సినిమా వెంటనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే త్రివిక్రమ్ ఎక్కడో చోట బయటకొస్తే కానీ వీలుపడదు.