ASBL NSL Infratech

రేవంత్ రెడ్డికి ఈసీ ఝలక్.. కేబినెట్ మీటింగ్‌కి ‘నో’

రేవంత్ రెడ్డికి ఈసీ ఝలక్.. కేబినెట్ మీటింగ్‌కి ‘నో’

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. రెండు రోజుల క్రితమే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి కూడా చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పాటు తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతుండడంతో రేవంత్ సర్కార్ విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో భేటీని పోస్ట్ పోన్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉండడం వల్ల.. ఇలాంటి టైంలో కేబినెట్ మీటింగ్‌కు అనుమతిస్తే ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే అనుమతి నిరాకరిస్తున్నామని ఈసీ పేర్కొంది. దీంతో చివరి నిమిషంలో కేబినెట్ మీటింగ్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఈ నెల 27న పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగుస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :