ASBL Koncept Ambience
facebook whatsapp X

పాన్ ఇండియా సినిమాల‌తో వ‌స్తున్న నాని, విజ‌య్

పాన్ ఇండియా సినిమాల‌తో వ‌స్తున్న నాని, విజ‌య్

ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి త‌మ‌కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌మ న‌ట‌న‌తో అంద‌ర్నీ మెప్పిస్తూ త‌మ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు. చిన్న హీరోలుగా మొద‌లైన వీరిద్ద‌రూ ఇప్పుడు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. మొద‌ట క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి త‌ర్వాత పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవింద లాంటి హిట్లు అందుకున్నాడు విజ‌య్. నాని అష్టాచెమ్మా లాంటి చిన్న బ‌డ్జెట్ సినిమా నుంచి ఇప్పుడు ద‌స‌రా, హాయ్ నాన్న లాంటి భారీ హిట్స్ ను అందుకునే స్థాయికి ఎదిగాడు. టాలీవుడ్ టైర-2 హీరోల్లో నాని, విజ‌య్ రేంజ్ వేర‌ని చెప్పాలి. వాళ్ల సినిమాల‌కు మంచి టాక్ వ‌స్తే క‌లెక్ష‌న్ల వ‌ర్షం కుర‌వ‌డం ఖాయం. ప్ర‌స్తుతం విజ‌య్ చేతిలో మూడు, నాని చేతిలో నాలుగు సినిమాలున్నాయి.

రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో ఫ్లాప్ ను మూట గ‌ట్టుకున్న విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ఇవి కాకుండా ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్య‌న్ తో ఒక సినిమాకు క‌మిట్ అయ్యాడు. మ‌రోవైపు నాని ప్ర‌స్తుతం స‌రిపోదా శ‌నివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత సుజిత్ తో ఓ సినిమా, ద‌స‌రా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ తో ఓ సినిమా, బ‌ల‌గం ఫేమ్ వేణుతో ఎల్ల‌మ్మ అనే సినిమాల‌ను చేయ‌నున్నాడు. వీరిద్ద‌రూ చేయ‌బోయే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఈ సినిమాల‌న్నీ మంచి హిట్ల‌యితే ఈ ఇద్ద‌రు హీరోలు టైర్1 లిస్ట్ లోకి ఎంట‌ర‌వ‌డం ఖాయం.

 

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :