ASBL NSL Infratech

ఫ్రీమాంట్‌లో వెంకట్‌ కోగంటి, సునీల్‌ పంట్ర, వెంకట్‌ అడుసుమిల్లి ప్రచారం

ఫ్రీమాంట్‌లో వెంకట్‌ కోగంటి, సునీల్‌ పంట్ర, వెంకట్‌ అడుసుమిల్లి ప్రచారం

తానా ఎన్నికల్లో జాయింట్‌ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న వెంకట్‌ కోగంటి, జాయింట్‌ ట్రెజరర్‌ పదవికి పోటీ పడుతున్న సునీల్‌ పంట్ర, నార్త్‌ కాలిఫోర్నియా ఆర్‌విపి అభ్యర్థి వెంకట్‌ అడుసుమిల్లి ఫ్రీమాంట్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని తమను గెలిపించాల్సిందిగా తానా సభ్యులను, మిత్రులను కోరారు. నరేన్‌ కొడాలి వర్గానికి చెందిన వీరు తాము చేసిన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికల్లో తమకు  ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాంత్‌ దొడ్డపనేని కో ఆర్డినేట్‌ చేశారు. త్వరలోనే మిగతా ప్రాంతాల్లో కూడా ప్రచార కార్యక్రమాలను చేయనున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతానికి సహకరించిన శ్రీకాంత్‌ దొడ్డపనేని టీమ్‌కు, ఇతర మిత్రులకు వచ్చిన తానా సభ్యులకు కాలిఫోర్నియాలో నరేన్‌ కొడాలి టీమ్‌కు సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వెంకట్‌ కోగంటి ధన్యవాదాలు తెలియజేశారు.

 

Click here for Photogallery

 

 

Tags :