ASBL NSL Infratech

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యుకె దీపావళి సంబరాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యుకె దీపావళి సంబరాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యుకె (టాస్-యుకె) లివింగ్స్టన్ లోని ఇన్వర్ ఆల్మండ్ కమ్యూనిటీ హైస్కూల్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కాన్సుల్ జనరల్ సత్యవీర్ సింగ్ హాజరయ్యారు.

సంస్థ సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ పర్రి కార్యక్రమాన్ని తన ఆత్మీయ స్వాగతంతో ప్రారంభించారు. ప్రారంభంలో సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు విద్యార్థులు "మా తెలుగు తల్లికి" పాటను ప్రార్థనగా ఆలపించించారు. ఈ మొత్తం కార్యక్రమం లో నాలుగేళ్ళ నుండి డెబ్బైల్లో ఉండేవాళ్ళ వరకూ పాల్గొని గానం, నృత్యం, నాటకాలు మరియు వాయిద్యం వంటి విభిన్నమైన అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. పుష్య రాగ సిద్ధ సాయి హరి మరియు దివ్య దేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

భారత కాన్సుల్ జనరల్ సత్య వీర్ సింగ్ తన ప్రసంగంలో బహుళ తరాల భాగస్వామ్యాన్ని గుర్తించి ప్రశంసించారు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలు మరియు విలువలను విదేశాల్లో ఉంటూ భవిష్యత్ తరాలకు అందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సాంస్కృతిక వారసత్వం పట్ల శాశ్వతమైన నిబద్ధతను సూచిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాత్రమే కాకుండా పూర్వ ఎగ్జిక్యూటివ్ కమిటీల ప్రతినిధులు కూడా నిర్వహించిన సాంప్రదాయ వేడుక అయిన జ్యోతి ప్రజ్వలన ఒక ప్రత్యేక క్షణం. 

ఛైర్మన్ మైథిలి కెంబూరి ఈవెంట్ యొక్క సమన్వయం మరియు అమలును పర్యవేక్షించగా, ప్రాజెక్ట్స్ & ఉమెన్స్ సర్వీసెస్ సెక్రటరీ మాధవీలతా దండూరి లాజిస్టిక్స్ మరియు పార్టిసిపెంట్ సీక్వెన్సింగ్లో సహాయపడింది. అధ్యక్షుడు శివ చింపిరి మార్గదర్శకత్వం అందించగా, సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ పర్రి కార్యక్రమాన్ని రూపొందించారు. కోశాధికారి నిరంజన్ నూక మరియు సంయుక్త కార్యదర్శి వెంకటేష్ గడ్డం ప్రవేశం ద్వారం వద్ద హాజరైనవారిని స్వాగతిస్తూ టికెట్లను పర్యవేక్షించారు. ఐటి & పిఆర్ కార్యదర్శి పండరి జైన్ పోలిశెట్టి సాంకేతిక సహకారాన్ని, పుబ్లిసిటీని మరియు ప్రత్యక్ష ప్రసారాలను నిర్వహించారు. క్రీడా శాఖ కార్యదర్శి జాకీర్ షేక్ మరియు యువజనసేవా కార్యదర్శి నరేష్ దీకొండ లాజిస్టిక్స్, క్యాటరింగ్ విక్రేతల సమన్వయానికి సహకరించారు. ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ కూచడి వేదికాలంకరణ బాధ్యతలను తీసుకోవడమే గాక చివరలో అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదనపు ప్రాజెక్టుల కార్యదర్శులు రాజశేఖర్ సాంబ మరియు బాలాజి కర్నాటి నైపుణ్యంగా లాజిస్తిక్స్ మరియు ప్రదర్శకుల సీక్వెన్సింగ్ మరియు సమన్వయంలో సహాయపడ్డారు. 

ఈ కార్యక్రమంలో వివిధ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్లకు చెందిన గౌరవ అతిథులు కూడా పాల్గొన్నారు. టాస్-యుకె దీపావళి సంబరాలు 2023 స్కాట్లాండ్లోని భారతీయ తెలుగు సమాజం యొక్క ఐక్యత, వైవిధ్యం మరియు అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచింది.

 

 

Tags :