ASBL NSL Infratech

తానా మహాసభలకు నామా నాగేశ్వరరావుకు ఆహ్వానం

తానా మహాసభలకు నామా నాగేశ్వరరావుకు ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‍ సెంటర్‍లో జరగనున్నాయి. ఈ మహాసభలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్‍ రవి పొట్లూరి, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‍ వంశీ కోట ఆహ్వానిస్తున్నారు. ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావును, మహబూబ్‍నగర్‍ ఎంపి శ్రీనివాస్‍ రెడ్డిని తానా నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జగదీష్‍ ప్రభల, ప్రసాద్‍ గారపాటి కూడా పాల్గొన్నారు.

 

 

Tags :