ASBL NSL Infratech

సతీష్ రెడ్డిని కలిసిన రవి పొట్లూరి

సతీష్ రెడ్డిని కలిసిన రవి పొట్లూరి

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానిస్తున్నారు. భారత దేశ రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు, అణు పితామహుడు హోమీ జహంగీర్‌ భాభా స్మారక స్వర్ణ పతకం గ్రహీత, భారత వైమానిక అభివృద్ధి పరిపాలన సంస్థ చైర్మన్‌ జి. సతీష్‌ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి జులై 7,8,9 తేదీలలో జరగబోయే తానా మహాసభలకు ఆహ్వానించడం జరిగింది.

 

 

Tags :