ASBL NSL Infratech

తానా ఎన్నికల్లో పోటీ తీవ్రం... బరిలో నిలిచిన అభ్యర్థులు

తానా ఎన్నికల్లో పోటీ తీవ్రం... బరిలో నిలిచిన అభ్యర్థులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి డా. నరేన్‌ కొడాలి, గోగినేని శ్రీనివాస పోటీ పడుతున్నారు. తానా కార్యదర్శి పదవికి రాజా కసుకుర్తి, అశోక్‌బాబు కొల్లా పోటీ పడుతున్నారు. ట్రజరర్‌ పదవికి భరత్‌ మద్దినేని, శిరీష తూనుగుంట్ల పోటీ పడుతున్నారు. జాయింట్‌ సెక్రటరీ పదవికి వెంకట్‌ కోగంటి, శ్రీని యలవర్తి పోటీ పడుతున్నారు. జాయింట్‌ ట్రెజరర్‌ పదవికి సునీల్‌ పంత్ర, రజనీకాంత్‌ కాకర్ల పోటీ పడుతున్నారు.

కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి లోకేష్‌ కొణిదెల, వాసిరెడ్డి వంశీ కృష్ణ, కల్చరల్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి ఉమ ఆర్‌ కటికి, మాధురి ఎల్లూరి, ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి రజని ఆకురతి, భోగవల్లి పద్మ పోటీ పడుతున్నారు. కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ పదవికి సతీష్‌ కొమ్మన, సతీష్‌ పునటి, ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి టాగూర్‌ మలినేని, శశాంక్‌ యార్లగడ్డ పోటీ పడుతున్నారు. స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ పదవికి శ్రీధర్‌ కుమార్‌ కొమ్మాలపాటి, నాగమల్లేశ్వరరావు పంచుమర్తి పోటీ పడుతున్నారు. తానాలోని ఫౌండేషన్‌, బోర్డ్‌ పదవులకు పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. 

కాగా ఈ ఎన్నికల నిర్వహణ కోర్డు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా ఉంటుందని బోర్డ్‌ వర్గాలు తెలిపాయి. దాంతో ఎన్నికల కమిటీ కూడా ఎన్నికల నిర్వహణలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 

 

 

Tags :