ASBL NSL Infratech

తానా ‘ధీం-తానా’ పోటీలకు విశేష స్పందన

తానా ‘ధీం-తానా’ పోటీలకు విశేష స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జులై 7, 8, 9 తేదీలలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తానా మహాసభలకు ముందు ధీం-తానా పోటీలు నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో జూన్ 17వ తారీఖున నిర్వహించిన ధీం-తానా పోటీలకు స్థానికుల నుండి విశేష స్పందన వచ్చింది.

మొట్టమొదటగా జ్యోతి ప్రజ్వలనతో పార్రంభం అయిన పోటీలు క్లాసికల్ సింగింగ్, ఫిల్మీ సింగింగ్, క్లాసికల్ డాన్స్, ఫిల్మీ డాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా, బ్యూటీ పేజెంట్ మరియు చిలక గోరింకా పోటీలతో సాయంత్రం వరకు సాగాయి. ఈ ధీం-తానా పోటీలు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అండ్ అడల్ట్స్ క్యాటగిరిలలో జరగటం విశేషం. ఇందులో మొదటి, రెండొవ స్థానాలలో గెలిచినా విజేతలకు ఫిలడెల్ఫియాలో జులై 8,9 తేదీలలో జరగబోయే 23వ తానా మహాసభలలో ఫైనల్స్ లో పాల్గొంటారు అని నిర్వాహకులు తెలిపారు. యువత ప్రతిభకు పట్టం కట్టే ఈ పోటీలను మిడ్ అట్లాంటిక్ ప్రాంత ప్రతినిధి సునీల్ కోగంటి, ధీం-తానా కో చైర్ శ్రీలక్ష్మి కులకర్ణి, ధీం-తానా ఫిలడెల్ఫియా కోఆర్డినేటర్ కృష్ణ నందమూరి తదితరులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధీం-తానా ఛైర్ మాలతి నాగభైరవ, కో చైర్ సోహిని అయినాలా కూడా విచ్చేసారు. అలాగే మహాసభలలో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించిన చదరంగం పోటీ విజేతలకు ఈ కార్యక్రమంలో ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమం అనంతరం మహాసభల కమిటి సభ్యులను ఒక్కొక్కరిగా వచ్చి వారి టీంతో మహాసభల సావనీర్ కోసం ఫోటోలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ లక్ష్మి మోపర్తి గారికి, మొవర్స్ డాట్ కం విద్య గారపాటి గారికి, న్యూ జెర్సీ శైలస్ డాన్స్ అకాడమీ వారికీ, హౌస్ అఫ్ బిర్యానీస్ అండ్ కబాబ్స్, భూమి కాఫీ, టీవీ9, కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీలక్ష్మి కులకర్ణి, అపర్ణ వాగ్వల, మాన్విత యాగంటి, బిందు జాస్తి, వ్యోం క్రొత్తపల్లి తదితరులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, డైరెక్టర్ వంశి కోట, జాయింట్ ట్రెజరర్ వెంకట్ సింగు, సునీల్ కోగంటి తో పాటు మరెందరో తానా కార్యవర్గం నాయకులు పాల్గున్నారు.

ఈ కార్యక్రమంలో కిరణ్ కొత్తపల్లి, రవి వీరవల్లి, ఫణి కంతేటి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, రవి తేజ ముత్తు, మోహన్ మళ్ల, రాజేశ్వరి కోడలి, భవాని క్రొత్తపల్లి, చలం పావులూరి, మనీషా మేక, రమ్య పావులూరి, సరోజ పావులూరి, గోపి వాగ్వాల, నాయుడమ్మ చౌదరి యలవర్తి, చంద్ర శేఖర్ రావు భాసుట్కార్, సంతోష్ కుమార్ రౌతు, ఉమాకాంత్ రఘుపతి, హరీష్ అన్నాబత్తిన, సనత్ వేమూరి, దశరధ రామయ్య తలపనేని, పార్ధ మాదాల, కోటిబాబు యాగంటి, కళ్యాణ్ ఆచంట, హేమంత్ యెర్నేని, మురళి పమిడిముక్కల, శ్రీనివాస్ చెరుకూరి, మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, వెంకట్ చెమ్చా, అరుణ్ రుద్రా, తిరుపతి రావు బైరాపునేని, శ్రీకాంత్ గూడూరు, హరినాథ్ దొడ్డపనేని, సుబ్రహ్మణ్యం ఓసూరు, సాంబయ్య కోటపాటి, రామ ముద్దన, లక్ష్మి, రాజు గుండాల, కోట, శ్రావణి, వెంకట్రావు గూడూరు, కిషోర్ కుకలకుంట్ల, శ్రీ అట్లూరి తో పాటు ఇంకెందరో మహాసభల కమిటి సభ్యులను, వాలంటీర్లను పూల గుచ్ఛలతో వేదికపై ఘనంగా సత్కరించారు.

 

Click here for Event Gallery

 

 

Tags :