ASBL NSL Infratech

తానా మహాసభల్లో.. జీవితాన్ని ఆనందంగా మార్చే పాఠాలు!

తానా మహాసభల్లో.. జీవితాన్ని ఆనందంగా మార్చే పాఠాలు!

తానా మహాసభలకు అంతా సిద్ధమైంది. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో భాగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఈ సెషన్లు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల్లో మూడు సెషన్స్ జరగనున్నాయి. జులై 8వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు రూం నెంబర్ 105-బీలో ‘సక్సెస్ వితౌట్ స్ట్రెస్’ సెషన్ జరుగుతుంది. విరాట్ దీన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మరుసటి రోజు అంటూ జులై 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అదే రూంలో శ్రీమతి భవానీ ‘మైండ్‌ఫుల్ పేరెంటింగ్’ సెషన్ నిర్వహిస్తున్నారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు సుధాకర్ ‘బ్యాక్ టు ది రూట్స్’ సెషన్‌లో ఎన్నో విషయాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సెషన్స్ ద్వారా వ్యక్తిగతంగా ఎంతో ఎదిగే అవకాశం ఉంది. ఆలోచనా ధోరణి మారడంతోపాటు జీవిత ప్రయాణాన్ని మరింత అందంగా, ఆనందంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకెందుకాలస్యం? ఈ సెషన్స్‌లో పాల్గొనేందుకు వెంటనే https://tanaconference.org/event-registration.html ఈ లింకులో రిజిస్టర్ చేసుకోండి.

 

 

Tags :