ASBL NSL Infratech

తానా కార్యవర్గంలో జాయింట్‌ ట్రెజరర్‌ సునీల్‌ పంట్ర

తానా కార్యవర్గంలో జాయింట్‌ ట్రెజరర్‌ సునీల్‌ పంట్ర

తానా జాయింట్‌ ట్రెజరర్‌గా సునీల్‌ పంట్ర ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన సునీల్‌ పంట్ర తానాలో వివిధ పదవులను నిర్వహించి ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేశారు. 

తానాలో 2009 నుంచి పనిచేస్తున్న సునీల్‌ పంట్ర ఎన్నో పదవులను చేపట్టారు.  ధీంతానా సమన్వయకర్తగా, ప్రకటనల విభాగం అధ్యక్షునిగా, డెట్రాయిట్‌ తానా మహాసభల ప్రచార విభాగం నాయకునిగా, ఎలక్ట్రానిక్‌ మీడియా చైర్‌పర్సన్‌గా, డెట్రాయిట్‌ సభల మీడియా విభాగం అధ్యక్షుడిగా, తానా సాంస్కృతిక సేవల సమన్వయకర్తగా  తానా ప్రాంతీయ ఉపాధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారు.  ఇటీవల తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేసి దాదాపు వందకు పైగా కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో సమన్వయపరచడంతోపాటు తానా సేవలను, కార్యక్రమాలను ఎంతోమందికి చేరవేయడంలో విజయం సాధించి తానాకు పేరు తీసుకువచ్చారు. 

తానా జాయింట్‌ ట్రెజరర్‌గా ఎన్నికైన తరువాత సునీల్‌ పంట్ర మాట్లాడుతూ, తానాకు నిధులు తేవడంతోపాటు, ఆర్థికపరమైన అంశాల్లో సాంకేతికతను వినియోగించడం వల్ల పారదర్శకంగా అన్ని వివరాలు అందురూ తెలుసుకునేలా చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

 

 

Tags :