ASBL NSL Infratech

చిత్ర గానంతో పరవశించనున్న తానా మహాసభలు

చిత్ర గానంతో పరవశించనున్న తానా మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో  జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు. సినీ సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ నేపథ్య గాయని, దక్షిణ భారత నైటింగేల్‌గా పిలిచే కె.ఎస్‌. చిత్ర తానా మహాసభలకు రానున్నారు. తమ పాటలతో అందరినీ ఆమె పరవశింపజేయనున్నారు. తెలుగు సినిమాల్లో ఎన్నో హిట్‌ చిత్రాలకు పాటలను పాడిన చిత్ర రాక సినీ ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తున్నడంలో సందేహం లేదు.  

 

 

Tags :