ASBL NSL Infratech

తానా మహాసభల్లో అద్భుతమైన జీవిత పాఠాలు చెప్పిన సద్గురు జగ్గీ వాసుదేవ్

తానా మహాసభల్లో అద్భుతమైన జీవిత పాఠాలు చెప్పిన సద్గురు జగ్గీ వాసుదేవ్

అగ్రరాజ్యంలో తానా 23వ మహాసభలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్.. తన విలువైన మాటలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. బాల మురళీకృష్ణ ‘వస్తా వట్టిదే.. పోతా వట్టిదే..’ పాటతో తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మనసును కంట్రోల్ చేసుకోవడం గురించి చక్కగా వివరించారు. ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించకూడదని అనుకుంటే.. దాని గురించే ఆలోచిస్తామన్నారు. ‘మన మనసు ఒక అద్భుతం. కానీ దాన్ని మనకు కష్టాలు మిగిల్చే మెషీన్‌గా మార్చేశాం. డిప్రెషన్, ఇంకేదైనా పేరు పెట్టొచ్చు. ఇలా పేరేదైనా మనకు అది మిగిల్చేది సమస్యే’ అని చెప్పారు. మరీ ఎమోషనల్‌గా ఉండటం వల్ల ఉపయోగం ఉండదన్నారు. మన మనసు మన చెప్పుచేతల్లో ఉంటేనే దాన్ని సరిగా ఉపయోగించుకోగలమని తెలిపారు. ‘మనం ఇప్పుడు ఉన్న సమయం చాలా గొప్పది. ఎందుకంటే ఎవరు మాట్లాడినా వేలాది మంది వినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు ఎందరో మహానుభావులు అద్భుతమైన విషయాలు చెప్పారు. కానీ అప్పట్లో వినేవాళ్లు పది మంది కూడా ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఇలాంటి సమయంలో కూడా మన మనసు విప్పి మంచి మాటలు వినకపోతే అది మన తప్పు’ అని చెప్పారు. మనం అద్భుతమైన వ్యక్తిగా  ఉంటే ప్రపంచానికి ఎంతో సేవ చేసినట్లే అన్నారు.

 

 

 

Tags :