ASBL NSL Infratech

ఇళయరాజాను ఆహ్వానించిన రవి పొట్లూరి

ఇళయరాజాను ఆహ్వానించిన రవి పొట్లూరి

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులను  మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా చెన్నైలో ఉన్న ఇళయరాజాను కలుసుకుని తానా మహాసభలకు రావాల్సిందిగా రవి పొట్లూరి స్వయంగా ఆహ్వానించారు. మహాసభల్లో ఇళయరాజా గ్రాండ్‌కచేరిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తానా మహాసభలకు ఇళయరాజా సంగీత కచేరీ గ్రాండ్‌ ఆకర్షణగా ఉంటుందని భావిస్తున్నారు. 

 

 

Tags :