ASBL NSL Infratech

హెచ్ఐసీసీని పరిశీలించిన నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్

హెచ్ఐసీసీని పరిశీలించిన నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్

హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ఏర్పాట్లను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ పరిశీలించారు. పనులు చురుకుగా సాగుతుండటంతో సంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. మహిళలకు ప్రథమ ప్రాధాన్యం- అందరికీ సౌభాగ్యం అంశంపై అమెరికా-భారత్ సంయుక్తంగా నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో సదస్సు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

సదస్సు బాధ్యతలను నీతి ఆయోగ్ చూసుకుంటుండగా, అమితాబ్‌కాంత్  హెచ్‌ఐసీసీ వేదికతోపాటు హైటెక్స్, ఫలక్‌నుమా ప్యాలెస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ స్థలాల ప్రత్యేకతలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్.. సీఈవోకు వివరించారు. ప్రభుత్వపరంగా సహకరిస్తామని తెలిపారు. త్వరలో అమెరికా ప్రతినిధి బృందం ఈ వేదికను పరిశీలించనున్నట్టు సమాచారం. సదస్సులో వందకుపైగా దేశాల నుంచి రెండువేల మందికి పైగా ప్రతినిధులు, ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, వివిధ దేశాల మంత్రులు పాల్గొననున్నారు.

 

Tags :