ASBL NSL Infratech

శాక్రమెంటోలో నరేన్‌ కొడాలి వర్గం ప్రచారం

శాక్రమెంటోలో నరేన్‌ కొడాలి వర్గం ప్రచారం

తానా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నరేన్‌ కొడాలి వర్గానికి చెందిన అభ్యర్థులు తమ గెలుపుకోసం శాక్రమెంటోలో ఆదివారం ఉదయం తానా అభిమానులతో, మిత్రులతో సమావేశమయ్యారు. తానా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తమను గెలిపించాలంటూ ఈ సందర్భంగా వారు కోరారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్న నరేన్‌ కొడాలి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వివిధ పదవుల ద్వారా తానాకు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఆయనతోపాటు మమ్మల్ని కూడా మీ ఓటుతో గెలిపించి తానా సేవకు తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికల్లో జాయింట్‌ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న వెంకట్‌ కోగంటి, జాయింట్‌ ట్రెజరర్‌ పదవికి పోటీ పడుతున్న సునీల్‌ పంట్ర, నార్త్‌ కాలిఫోర్నియా ఆర్‌విపి అభ్యర్థి వెంకట్‌ అడుసుమిల్లి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రమా కోమటి కో ఆర్డినేట్‌ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతానికి సహకరించిన రమకోమటి టీమ్‌కు, ఇతర మిత్రులకు వచ్చిన తానా సభ్యులకు కాలిఫోర్నియాలో నరేన్‌ కొడాలి టీమ్‌కు సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వెంకట్‌ కోగంటి ధన్యవాదాలు తెలియజేశారు. 

 

Click here for Photogallery

 

 

Tags :