ASBL NSL Infratech

అసాధారణ భద్రతా ఏర్పాట్లు

అసాధారణ భద్రతా ఏర్పాట్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. అమెరికా హైదరాబాద్‌పై అమెరికా డేగకన్ను వేసింది. పలు ఉగ్రవాద దేశాలు, ఉగ్రవాద సంస్థల నుంచి ఆమెకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనే అమెరికా బృందానికి ఇవాంకా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక భద్రతా విధులన్నీ అమెరికా సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీయే పర్యవేక్షిస్తోంది. ఇవాంకా హైదరాబాద్‌లో ఉన్నంత సేపూ అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేలా ఏర్పాట్లు జరిగాయి. 

 

Tags :