ASBL NSL Infratech

తానా వేదికపై ‘సిరివెన్నెల సమగ్ర సాహిత్యం’ ఆవిష్కరణ

తానా వేదికపై ‘సిరివెన్నెల సమగ్ర సాహిత్యం’ ఆవిష్కరణ

తెలుగు సినీ గీత రచయితల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. తెలుగు భాష గురించి మాట్లాడినప్పుడు ఆయన గురించి ప్రస్తావించకుండా ఉండలేం. అందుకే తానా 23వ మహాసభల్లో ఆయన్ను కూడా స్మరించుకోవడం జరిగింది. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో సిరివెన్నెల సమగ్ర సాహిత్యం సినిమా పాటలు మొత్తం నాలుగు సంపుటాలను ఆవిష్కరించారు. అలాగే సిరివెన్నెల సినిమాయేతర సాహిత్యం రెండు సంపుటాలను కూడా ఆవిష్కరించడం జరిగింది. సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, ఎంపీ రఘురామ కృష్ణం రాజు, టీడీ జనార్ధన్, నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సంపుటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సతీమణి చేంబోలు పద్మావతి గారిని, సిరివెన్నెల కుమారులు వెంకట యోగీశ్వర శర్మను, సిరివెన్నెల సొదరుడు శ్రీరామ శాస్త్రిని తానా నేతలు సత్కరించారు.

 

 

 

Tags :