ASBL NSL Infratech

వైభవంగా డిటిఎ దీపావళి వేడుకలు

వైభవంగా డిటిఎ దీపావళి వేడుకలు

డిట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ (డిటిఎ) దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాంటన్‌లోని హిందూ టెంపుల్‌లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 1000 మందికి పైగా తెలుగువాళ్ళు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. డిటిఎ అధ్యక్షుడు కిరణ్‌ దుగ్గిరాల అందరినీ ఆహ్వానించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. డిటిఎ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ వేడుకల్లో 300 మందికి పైగా కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.

కమ్యూనిటీకి సేవ చేసిన పలువురిని అవార్డులతో సత్కరించారు. ముఖ్యమైన డిటిఎ వడ్లమూడి వెంకటరత్నం అవార్డు 2023ను సుధీర్‌ బచ్చుకు అందజేశారు. డిటిఎ కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డును కళ్యాణి మంత్రిప్రగడకు, శ్రీనివాస చిత్తలూరికి, డిటిఎ కమ్యూనిటీ లీడర్‌ షిప్‌ అవార్డును వినోద్‌ కుకునూరుకు, డిటిఎ కమ్యూనిటీ పార్టనర్‌ షిప్‌ అవార్డును చెంచురెడ్డి తాడి, సునీల్‌ మర్రికి అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఎంలైవ్‌ బ్యాండ్‌ కచేరీ జరిగింది. గాయనీ సుమంగళి, గాయకుడు శ్రీకాంత్‌ లంక, సాయితరంగ్‌ వందేమాతరం పాడిన పాటలు అందరినీ అలరించాయి.

ఈ వేడుకలను నీలిమ మన్నె, సునీల్‌ పాంట్ర, టీమ్‌ నరేన్‌ కొడాలివారు స్పాన్సర్‌ చేశారు. డిటిఎ ప్రెసిడెంట్‌ కిరణ్‌ దుగ్గిరాల, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సుబ్రత గడ్డం, సెక్రటరీ రాజా తొట్టెంపూడి, ట్రజరర్‌ ప్రణీత్‌ వెల్లూరు, జాయింట్‌ ట్రెజరర్‌ స్వప్న ఇల్లెందుల, పబ్లికేషన్స్‌ సెక్రటరీ మంజీర పాలడుగు, అర్చన చావల్ల, తేజ్‌ కల్లాశ్‌ అంగిరేకుల, సంజీవ్‌ పెద్ది తదితరులు విజయవంతం అయ్యేలా కృషి చేశారు. మసాల, బాస్మతి వారు ఫుడ్‌ను అందించారు, డిటిఎ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు నీలిమ మన్నె, జో పెద్దిబోయిన దీప్తి చిత్రపు, సుధీర్‌ బచ్చు తదితరులు కూడా వేడుకల విజయవంతానికి కృషి చేశారు.

 

Click here for Photogallery

 

 

Tags :