ASBL NSL Infratech

వైభవంగా క్యాట్స్‌ దసరా, దీపావళి సంబరాలు

వైభవంగా క్యాట్స్‌ దసరా, దీపావళి సంబరాలు

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (క్యాట్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా-దీపావళి వేడుకలు అందరినీ ఎంతగానో అలరించాయి. అక్టోబర్‌ 28వ తేదీన మేరీల్యాండ్‌ రాష్ట్రం క్లాస్‌ బర్గ్‌ నగరంలోని క్లాస్‌ బర్గ్‌ హైస్కూల్‌ లో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వాషింగ్టన్‌ డిసి మెట్రో ఏరియాలో నివసించే తెలుగు ప్రజలు దాదాపు 1500 మందికి పైగా విచ్చేయగా, 250 మంది కళాకారులతో నిర్విరామంగా 7 గంటల పాటు వేడుకలు కొనసాగాయి. జ్యోతి ప్రజ్వలన మరియు గణేశ ప్రార్ధనతో ప్రారంభమైన కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ఆసక్తికరంగా సాగాయి. స్థానిక నృత్య పాఠశాలలు ఈ పండుగల విశిష్టతను నృత్యరూపాలుగా ప్రదర్శించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి.

డిఎంవి స్థానిక కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి మరియు భరతనాట్యం నృత్య ప్రదర్శనలే కాకుండా టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ మరియు జానపద నృత్యాలు ప్రేక్షకులకు ఎంతగానో ఆహ్లదాన్ని అందించాయి. అందులో ముఖ్యంగా బ్రైటన్‌ లిటిల్‌ స్టార్స్‌ చేసిన రామాయణం స్కిట్‌, సంస్కృతి కళా అకాడమీ వారు చేసిన కృష్ణ లీల, కూచిపూడి డాన్స్‌ అకాడమీ జతిస్వరం, కూచిపూడి నృత్యాలయా వారి శాస్త్రీయ నృత్యాలు తెలుగు పండుగుల విశిష్ఠతను చాటిచెప్పగా, నవ్య ఆలపాటి వారి స్టార్జ్‌ డ్యాన్స్‌ స్కూల్‌ చిన్నారులు చేసిన శ్రీదేవి ట్రిబ్యూట్‌ కార్యక్రమానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

హరిత మరియు ప్రత్యూష వారి గ్రూప్‌ ఫోక్‌ డాన్స్‌ లు వీక్షించిన ప్రేక్షకుల తన్మయత్వం చేకూర్చాయి. రంగు రంగుల అలంకరణతో దుస్తులు ధరించి చేసిన ఫ్యాషన్‌ షోను వీక్షించిన వాళ్ళ మనసులను దోచడమే కాకుండా, క్యాట్స్‌ కార్యవర్గం వారు ఆ ర్యాంప్‌ వాక్‌ లో పాల్గొనడం విశేషం. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన స్పందన పల్లి గారు స్ఠానిక కళాకారులతో కలిసి చేసిన కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, ప్యూజన్‌ డాన్స్‌ మరియు టాలివుడ్‌ డాన్స్‌ పెర్ఫార్మన్స్‌ ప్రేక్షకుల మనసులను దోచాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మేరీల్యాండ్‌ లెప్ఠినెంట్‌ గవర్నర్‌ అరుణ మిల్లర్‌ ను క్యాట్స్‌ బృందం అతిథి సత్కారాలతో ఆహ్వానించి, పుష్పగుచ్చం మరియు ప్రత్యేకంగా నేయించిన శాలువాతో సత్కరించారు. ఈ ఈవెంట్‌ లో అరుణ గారు మాట్లాడుతూ తనకు గత 15 సంవత్సరాలుగా క్యాట్స్‌ సంస్థతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ తెలుగు భాష మీద తనకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. అరుణ మిల్లర్‌ తెలుగులో మాట్లాడుతూ, మనం ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నామని, ఇండియా లో ఉన్న ప్రజలకి సహాయార్ధం చేస్తున్న కృషిని కొనియాడుతూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న  కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాట్స్‌ సంస్థ స్పాన్సర్స్‌ ను శాలువా మరియు పుష్ప గుచ్చములతో ఘనంగా సత్కరించారు. ఈ దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా రుచికరమైన విందు భోజనమును ప్యారడైజ్‌ ఇండియన్‌ కుజిన్‌ రెస్టారెంట్‌ వారు అందించారు. ఈ వేడుకలకోసం ఏర్పాటు చేసిన ఫోటో బూత్‌ అందరినీ ఆకర్షించడంతో విచ్చేసిన వారందరూ తమ తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి ఫోటోలు దిగుతూ కనిపించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సతీష్‌ వడ్డీ అందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సంస్థ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమములో భాగంగా షెల్టర్‌ హోమ్స్‌ కోసం చేస్తున్న ఫుడ్‌ డ్రైవ్‌లు మరియు ఇండియాలో పేద విద్యార్థులకు చేస్తున్న చారిటీ సేవలను తెలియజేశారు. చెస్‌ ఔత్సాహికులు ఉత్సాహభరితమైన పోటీలలో 50 మందికి పైగా విద్యార్థులు పాల్గొనడమే కాకుండా ఈ కార్యక్రమంకు వ్యూహాత్మక ఉత్సాహాన్ని జోడించారు. చెస్‌ టోర్నమెంట్‌ లో గెలిచిన చిన్నారులకు ట్రోఫీలు మరియు సర్టిఫికెట్స్‌ ను ఆటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జయంత్‌ చల్లా, టిడిఎఫ్‌ మాజీ అధ్యక్షులు కవిత చల్లా, తేజ రాపర్ల అందజేశారు. హాజరైన వారికి థ్రిల్లింగ్‌ రాఫెల్‌ బహుమతులు అందించడంలో ఈ వేడుకకు ఒక నిరీక్షణను జోడించారు. 

ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు సతీష్‌ వడ్డీ అధ్యక్షతన, ఉపాధ్యక్షులు రామ ఎరుబండి, జెనరల్‌ సెక్రటరీ పార్థ బైరెడ్డి, కోశాధికారి రమణ మద్దికుంట, కల్చరల్‌ చైర్‌ విజయ దొండేటి, కల్చరల్‌ కో చైర్స్‌ లావణ్య, రంగ, మీనా, సుప్రజ, నవ్య, హరిత, ప్రత్యుష, పద్మ, జ్యోతి మరియు CATS కల్చరల్‌ అడ్వైసర్‌ గోపాల్‌ గారి సహాయంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులు బిక్షు నాయక్‌, పల్సర్‌ బైక్‌ రమణ, ఝాన్సీ, జబర్దస్త్‌ రమేష్‌, మౌనిక, లావణ్య, కీబోర్డ్‌ ఫ్రాన్సిస్‌, ఎం.ఎస్‌. రాజు, మనోహర్‌ సింగ్‌, వాజిద్‌ హుస్సేన్‌ (తబలా) లు సంగీత విభావరితో హైవోల్టేజ్‌ ఎనర్జిటిక్‌, నాన్స్‌స్టాప్‌ పాటలు ఒకరికొకరు పోటాపోటీగా పాడిన ఉత్సాహవంతమైన పాటలు ప్రేక్షకులను 3 గంటల పాటు ఉర్రూతలూగించి నాట్యం చేసేలా చేసాయి.

ఈ కార్యక్రమానికి ట్రస్టీలు మరియు అడ్వైజర్స్‌ రామ్మోహన్‌ కొండ, మధు కోలా, భాస్కర్‌ బొమ్మారెడ్డి, అనిల్‌ రెడ్డి, రవి బొజ్జ, ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌ కృష్ణ కిషోర్‌, మహేష్‌, పవన్‌ ధనిరెడ్డి, సాయి జితేంద్ర, రవి బారెడ్డి, లక్ష్మీకాంత్‌, తిప్ప రెడ్డి కోట్ల, ఉమాకాంత్‌, శ్రీనివాస్‌ కాసుల, ఇఎస్‌కె, విశాల్‌, మంజునాధ్‌ మిట్టపల్లి, శ్రీనివాస్‌ పూసపాటి, అమర్‌, కమలాకర్‌, ఫణి, రఘు, రామకృష్ణ, భార్గవ్‌, శివ పిట్టు, పింటూ, దినేష్‌, భానుక్రిష్ణ, భార్గవ్‌, ఉమాశంకర్‌, రవి తేజ, సందీప్‌ కాకా, సాయి నీలం, వివేక్‌, సందీప్‌, జయశ్రీ, అనుపమ, రజనిగార్లతో పాటు లోకల్‌ లీడర్‌ శ్రీధర్‌ నాగిరెడ్డి హాజరయ్యారు. జిటిఎ ఫౌండర్‌ విషు కలవల, మరియు డిసి చాప్టర్‌  కార్యవర్గ సభ్యులు కార్యక్రమానికి హాజరై అందరికి దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చివరన వైస్‌ ప్రెసిడెంట్‌ రామ ఎరుబండి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జాతీయ గీతాలాపనతో ముగించారు.

 

Click here for Event Gallery

 

 

 

Tags :