ASBL NSL Infratech

వివిధ నగరాల్లో జిఇఎస్ పై అవగాహన కార్యక్రమాలు

వివిధ నగరాల్లో జిఇఎస్ పై అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్‌లో నవంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు  నిర్వహించే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) పై ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. రోడు టు జీఈఎస్‌ పేరుతో వీటిని నిర్వహిస్తారు. మొదటి దశలో లక్నో, బెంగళూరు, ముంబై, చెన్నైలలో రోడ్‌ షోలు ఉంటాయి.

అవగాహణ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఇటీవల టీ హబ్‌ లో నిర్వహించిన ఈవెంట్‌లో వరంగల్‌ నిట్‌, హైదరాబాద్‌ బిట్స్‌ పిలాన్నీ, ఇతర ప్రైవేట్‌ వర్సిటీల విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. కార్యక్రమంలో నీతి అయోగ్‌ సలహాదారు అన్నరాయ్‌ పాల్గొన్నారు. నవంబర్‌ రెండోవారం వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. కేంద్రం తరుపున బాధ్యతలు చూస్తున్న నీతి అయోగ్‌ అధికారులు జీఈఎస్‌ లోగో ఆవిష్కరించారు. సదస్సు నిర్వహించే హెచ్‌ఐసీసీ, హెట్‌క్స్‌, ఫలక్‌నామా ప్యాలెస్‌లను నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ స్వయంగా పరిశీలించారు. సదస్సు వేదిక, వసతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే అమెరికా ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు వచ్చి సదస్సు వేదిక, వసతి, రవాణా ఏర్పాట్లను పరిశీలించనున్నది.

Tags :