Tulsi Gabbard: ముష్కరుల వేటలో భారత్‌కు సహకరిస్తాం : తులసీ గబ్బార్డ్

26 మంది అమాయక పర్యాటకుల మరణానికి కారణమైన పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి బాధ్యులైన వారి కోసం సాగిస్తున్న వేటలో అమెరికా భారత్ (India) వెంట నిలుస్తోందని అమెరికా జాతీయ గూఢచార సంస్థ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) అన్నారు. పహల్గాంలో జరిగిన అత్యంత భయానకమైన ఇస్లామిస్టు తీవ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో మేము భారత్‌కు సంఫీుభావం తెలుపుతున్నాం అని గబ్బార్డ్ పేర్కొన్నారు. తమ ప్రీతిపాత్రుల్ని కోల్పోయిన వారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఆమె అన్నారు.