Mrs. India: మిసెస్ ఇండియా-2025 విజేత గా నమిత కుల్ శ్రేష్ట

హైదరాబాద్ సిటీ బేగంపేటకు చెందిన నమిత కుల్ శ్రేష్ట (Namitha Kul Shrestha) మిసెస్ ఇండియా -2025 టైటిల్‌ను దక్కించుకున్నారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె కుటుంబసభ్యులు వివరాలు వెల్లడిరచారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఢల్లీిలో నిర్వహిచిన వీజీ మిసెస్ ఇండియా -2025 పోటీలకు దేశవ్యాప్తంగా 700 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని, చివరి నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఫైనల్ పోటీలకు 56 మంది ఎంపికయ్యారని తెలిపారు. అందులో కఠిమైన రౌండ్లు, సవాళ్లతో కూడిన పోటీలో జడ్జిలు (Judges) అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన నమిత కుల్‌శ్రేష్ట మిసెస్ సౌత్ జోన్ టైటిల్ (South Zone Title) తోపాటు ఆమె వయో వర్గంలో మిసెస్ ఇండియా-2025 ఐటిల్ గెలుచుకున్నారు.దీంతో పాటు మిసెస్ ఇండియా ఎలిగెన్స్, మిసెస్ ఇండియా గ్రేస్‌పుల్, సోల్ మిసెస్ ఇండియా చారిటీ క్వీన్ టైటిళ్లు కూడా నమిత కుల్‌శ్రేష్టకు దక్కాయని పేర్కొన్నారు.