Yogi Adityanath: అరుదైన రికార్డ్ సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ కు వరుసగా అత్యధిక కాలం ముఖ్యమంత్రి (Chief Minister) గా పనిచేసిన వ్యక్తిగా యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అరుదైన రికార్డు (Record) సృష్టించారు. యూపీకి వరుసగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఇప్పటివరకు మాజీ సీఎం గోవింద్ వల్లభ్ పంత్ (Govind Vallabh Pant) ఉన్నారు. ఇప్పుడు ఆయన రికార్డును యోగీ ఆదిత్యనాథ్ బద్దలుకొట్టారు. గోవింద్ వల్లభ్ పంత్ వరుసగా 8 సంవత్సరాల 127 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగి, రాష్ట్రానికి వరుసగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. సోమవారంతో కలిపి యోగీ ఆదిత్యనాథ్ వరుసగా 8 సంవత్సరాల 4 నెలల 10 రోజులు యూపీ సీఎంగా కొనసాగారు. దాంతో గోవింద్ వల్లభ్ పంత్ రికార్డు బద్దలైంది. ఈ విషయాన్ని యూపీ సీఎంవో (UP CMO) వెల్లడించింది.






