America: ఆగస్టు 25న భారత్‌కు అమెరికా బృందం

భారత్-అమెరికా మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఇందు కోసం అమెరికా (America) అధికారుల బృందం భారత్ (India) కు రానుంది. ఆగస్టు (August) 25 నుంచి ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. రెండు దేశాలు మధ్యంత వాణిజ్య ఒప్పందం (Trade agreement) కుదుర్చుకునేందుకు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ట్రంప్ (Trump) వివిధ దేశాలపై విధించిన సుంకాలను ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ గడువుకు ముందే మధ్యంతర ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నించింది. కొన్ని కీలకమైన రంగాలపై అవగాహన కుదరకపోవడంతో ఒప్పందం కుదరలేదు. తాజాగా అమెరికా అధికారుల బృందం ఆరో దఫా చర్చలు జరిపేందుకు భారత్‌కు వస్తోంది.