India : భారత్ చేసిన అభ్యర్థన ను అమెరికా అంగీకరించలేదు : కేంద్రం

భారత్ అల్యూమినియం, ఉక్కు సంబంధిత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ ( డబ్ల్యూటీవో) ఒప్పందం కింద చర్చలకు రావాలంటూ భారత్ (India) చేసిన అభ్యర్థనకు అమెరికా (America) అంగీకరించలేదని కేంద్రమంత్రి జితిన్ ప్రసాద (Jitin Prasad) లోక్‌సభలో వెల్లడిరచారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని వాటిని విధించినట్లు అగ్రరాజ్యం వాదించిందని లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. దిగుమతి సుంకాల విషయంలో డబ్ల్యూటీవో (WTO) అగ్రిమెంట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ నిబంధనలను అమెరికా పాటించనందున భారత్ సైతం అదే స్థాయిలో చర్యలు తీసుకునే హక్కు కలిగి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. స్టీల్, అల్యూమినియం (aluminum) పై అమెరికా సుంకాల విధింపును రక్షనాత్మక చర్యలుగా భారత్ భావిస్తోంది. డబ్ల్యూటీలో అగ్రిమెంట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ కింద సంప్రదింపులకు లోబడి ఉండాల్సిన అంశంగా దీన్ని పరిగణిస్తోంది.