ఇండియాలో మైక్రోచిప్ టెక్నాలజీ విస్తరణ
మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియాలో మరింత విస్తరించనుంది. ఇందుకోసం 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. వచ్చే 5 సంవత్సరాల్లో విస్తరణ కోసం ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఇంజినీరింగ్ ల్యాబ్‌లు, నైపుణ్యాలు, సమకూర్చుకోవడం, ప్రాంతీయ సాంకేతిక కన్సార్టియా, విద్యా సంస్థలకు మద్దతు ఇస్తుందని తెలిపింది. ఇప్పటికే సెమికండక్టర్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రాన్ ప్రకటించింది. ల్యామ్ రిసెర్చ్ అప్లయిడ్ మెటిరియల్స్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌ను ప్రకటించాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ మైక్రోచిప్ టెక్నాలజీ 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. మైక్రో కంట్రోలర్స్ తయారీలో మూడు టాప్ కంపెనీల్లో ఇది ఒకటి. పరిశ్రమలు, డేటా సెంటర్లు, కంప్యూటింగ్ ఆటోమోటీవ్, వినియోగదారుల ఉపకరణాలు, ఎయిర్‌స్పేస్, డిఫెన్స్ రంగాల్లో మైక్రోచిప్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది.






