Kishan Reddy: దేశ ప్రగతికి చోదకశక్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశాభివృద్ధిలో మైనింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆధునిక సాంకేతికతలలో క్లిష్టమైన ఖనిజాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఈ క్లిష్టమైన ఖనిజాల కోసం భారతదేశం విదేశాలపై ఆధారపడుతోందని, దేశీయ ఉత్పత్తి తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్, రెగ్యులేషన్ యాక్ట్ (MMDR Act) సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలిపిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోడీ మార్గదర్శనంలో మైనింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. 2015, 2021, 2023లో ఎంఎండీఆర్ చట్టానికి సవరణలు తీసుకొచ్చామని, తాజాగా మరో 6 సవరణలను సభ ముందు ఉంచామని కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. మైనింగ్ రంగం ద్వారా ఉపాధి కల్పన పెంచాలని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ముందుకెళ్తోందని కిషన్ రెడ్డి వివరించారు. 2014 ముందున్న ప్రభుత్వాల హయాంలో పారదర్శకత లేకుండా గనుల కేటాయింపులు జరిగేవని, కానీ 2014 తర్వాత పూర్తి పారదర్శకతతో వేలం ద్వారానే గనులను కేటాయిస్తున్నామని ఆయన (Kishan Reddy) వివరించారు.