Vijay : వచ్చే ఎన్నికల్లో డీఎంకేకు, తమ పార్టీకి మధ్యే పోటీ : విజయ్
తమ భావజాల శత్రువు బీజేపీ, రాజకీయ విరోధి డీఎంకే అని టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ (Vijay) పేర్కొన్నారు. మదురై (Madurai)లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK)కు, తమ పార్టీకి మధ్యే పోటీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపును తడుతామన్నారు. తనను ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతానని వ్యాఖ్యానించారు. కులం కాదు, మతం కాదు, తమిళుడికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.








